Jeevana Tarangaalu (Telugu Poetry)

Hi,

“Jeevana tarangaalu” Poems that gives everyone full of energy, motivation to reach their aspirations in life with new thoughts. Some poems reflects the politics, history, social life, nature of India during 1939-2014. This book motivates a common man in a society and inspires to move forward in life facing challenges and learning from failures.

“జీవన తరంగాలు”   (telugu poetry) authored by father  is published recently online at Amazon.com,Kinige.com and Pothi.com.

Please write your comments/feedback on this book at

  1. Kinige

http://kinige.com/book/Jeevana+Tarangal

if you like this book,you can share/like on facebook to your friends also.

About book:

“Jeevana tarangaalu” Poems that gives everyone full of energy, motivation to reach their aspirations in life with new thoughts. Some poems reflects the politics, history, social life, nature of India during 1939-2014. This book motivates a common man in a society and inspires to move forward in life facing challenges and learning from failures.

కొందరు వ్యక్తులు, కొన్ని పుస్తకాలు మనకు జీవితాంతము మరచిపోలేని జ్ఞాపకాలను ముందుకు నడిపించే శక్తిని ఇస్తాయి. తండ్రిగానే గాక గురువుగా నాన్న గారితో మాకున్న అనుబంధం, అనుభవం మరియు నాన్న నేర్పిన క్రమశిక్షణ మేము ఎన్నటికి మరచిపోలేము. మా చిన్నతనములో నాన్న వ్రాసిన ఈ “జీవన తరంగాలు” పుస్తకములోని గేయాలు ప్రతి ఒక్కరిని చైతన్యపరచి జీవిత సాగరములో ఆటుపోటుల నెదుర్కొని ముందుకు నడిపించే విధముగా వున్నాయి.

నాన్నగారు సగటు మనిషికి నిత్య జీవితములో ఎదురయ్యే సమస్యలను, జీవితకాలము (1939-2014)లో ఎదురైన అనుభవాలను, తన హృదయమును కదిలించిన సంఘటలను కలం పట్టి కాగితముపై అక్షర రూపములో పెట్టేవారు. అలా రాసిన గేయముల సంకలనమే ఈ “జీవన తరంగాలు” పుస్తకం.

నాన్న నా నవ్వులు చూసి మురిసిపోయేవారు. నన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు. నా కలతలను తీర్చేవారు. ఓడిపోతున్న సమయంలో ధైర్యాన్నిచ్చేవారు. గెలిచినప్పుడు భుజాన్ని తట్టేవారు. నీతి నిజాయతీల గురించి ఎప్పుడూ చెప్పేవారు. చదువు విషయంలో చేయూతనిచ్చేవారు. నాన్న నాపై కళ్ళెర్రజేసినా నాకిష్టమే. దాని వెనుక నా భవితపై ఆయన ఆరాటం కనిపించేది.

భవిష్యత్తు గురించి బెంగపడకూడదని నాలో ధైర్యాన్ని నింపేవారు. భయపడటం మానేస్తేనే జీవితంలో ముందుకెళ్ళగలమని అర్థమయ్యేలా వివరించేవారు. చక్కని నడవడికనూ, విలువలనూ తెలియజేశారు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, సమస్యలు ఎదుర్కొనేవారే సాహసవంతులంటూ సలహాలనిచ్చారు. జీవిత ప్రయాణంలో ఓర్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియజేసేవారు. నాన్నకు ఉన్న ఆదర్శగుణాలన్నీ ఆ

ఉత్తరాల ద్వారా నాకు చేరువయ్యాయి.

నాన్న ప్రేమ ఎంత మృదువుగా ఉంటుందో కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుందని నాకర్థం అయింది.

నా ఆలోచనలన్నీ నాన్న చుట్టే తిరుగుతున్నాయి. ‘నాన్న!’ ఇది రెండక్షరాల పదం మాత్రమే కాదు. ఒక అమూల్యమైన బంధం.

పల్నాడులో ని  ఎందరో విద్యార్థులకు  విద్యా బుద్దులను  నేర్పిన హిందీ పండితులు శ్రీ సూదా కోటేశ్వర రావు గారు గురజాలలో  ఒక సామాన్య వ్యవసాయ కుటుంబములో  1939 లో జన్మించారు . స్వయం కృషి తో  చదివి  ఆ రోజుల్లో  హిందీ లో “సాహిత్య రత్న ” పట్టా సాధించిన అరుదైన వ్యక్తులలో ఒకరు.

చదువు పూర్తి చేసిన తోలి రోజులలో  కొద్ది నాళ్ళు  బెజవాడ లో విశాలాంధ్ర  ప్రచురణల సంస్థ లో  చిరు ఉద్యోగము చేసినారు.  విశాలాంధ్ర లో తను  చేసిన ఉద్యోగము చిన్న స్థాయి  లో వున్నా  , నీతి నిజయితిలతో తన భాద్యతలను నిర్వహించి  అప్పటి  విజయవాడ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య , చంద్ర రాజేశ్వర రావు , రామచంద్ర రాజు ల అభిమానమును  చూరగొన్నాడు.  తరువాత 1964 లో హిందీ  వుపాధ్యునిగా 150 రూపాయలతో తన జీవితముని  ప్రారంభించారు . హిందీ ఉపాధ్యాయునిగా  తన సర్వీసు  లో ఎక్కువ  భాగము పల్నాడులో ని వెల్దుర్తి , దాచేపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాతశాలలలో  పని చేసి 1999 లో పదవీ విరమణ చేసారు . 1982 లో దాచేపల్లి లో గవర్నమెంట్  జూనియర్ కళాశాల పెట్టిన మెదటి ఏడు  కళాశాల విద్యార్థులకు  కూడా  హిందీ భాషను  భోదించారు .

చిన్న తనమునుంచే సాహిత్య రంగము మీద ఎంతో  అభిమానము కలవారు. తెలుగులో మరియు  హిందీ భాషలలో అనేక గేయములను,కధలను  రచించారు. మహాకవి శ్రీశ్రీ ప్రేరణతో  సామాన్య మానవుడు నిత్య జీవితములో ఎదుర్కొనే సమస్యలను   ,తన దైన  శైలిలో అనేక అభ్యుదయ  గేయముల ద్వార  తెలియ జేశారు . హిందీ లో ని  మచి సాహిత్యంను తెలుగు ప్రజలకు పరిచయము  చేయుటకు  కొన్ని కధలను  హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు.  సమాజములో సాంఘిక దురాచారముల ను , మూఢ నమ్మకముల ను వ్యతిరేకిస్తూ  హిందీ లో  యశపాల్  రాసిన  కధను ” పరదా ” పేరుతొ తెలుగులోకి అనువదించారు . తెలుగులో ని   సాహిత్యమును ఇతర  భాషలలోకి తీసుకెళ్ళే  ప్రయత్నములో భాగముగా  బద్దెన  తెలుగులో రాసిన “సుమాత్ శతకము” లోని  నూరు పద్యములను  హిందీ  భాషలోకి అనువదించారు . ఆయన రచించిన అనేక గేయములు  “ఐక్య ఉపాధ్యయ ” ఉపాధ్యయ  మాసపత్రిక లో ప్రచురించారు. కొన్ని  గేయములను త్యాగ రాయ జ్ఞాన సభ వారు , శ్రీ చైతన్య  సాహితి పరిషత్తు వారు ప్రచురించారు .  అప్రచురితమైన ,అచ్చుకాని గేయములు  కధలు ఎన్నో వున్నాయి . తన  జీవిత  కాలములో  రాసిన 50 పైగా  గేయముల  సంకలనమే  ఈ ” జీవన సాఫల్యం ”  పుస్తకం.

శ్రీ సూదా కోటేశ్వర రావు గారు  సాహత్య రంగములో  కృషితో పాటు , సమాజ సేవలో కూడా పాలుపంచుకున్నారు . దాచేపల్లి వున్నత పాతశాలలో త్రాగు నీటి పధకము లో భాగముగా  మంచి నీటి మినరల్  వాటర్ ప్లాంట్ ని  స్వంత నిధులతో  కట్టించారు.  రెంటచింతల మండలం సత్ర శాల ఆలయములో భక్తులకు ఉపయోగ పడేలా స్వయముగా  ఆడిటోరియం నిర్మించారు .నారాయణ పురం లో శ్రీ సీతారామలయ్మ అభివృధికి కృషి చేసారు. ఆలయ ప్రధాన కార్యదర్శిగావుంటూ విగ్రహ ప్రతిష్టకు 3 లక్షల  స్వంత నిధులు  అందించారు . దాచేపల్లి  హై స్కూల్ భవన్ విస్తరణకు అప్పటి  హెచ్ .ఎం  సీతరెడ్డి గారికి కుడి భుజముగా వుండి  విరాళములు సేకరించి అదనపు గదులు నిర్మించారు .

ఈ ” జీవన సాఫల్యము ” గేయ సంకలనము లో   ని  గేయము ” చదువుదాం-చదువుదాం”   విద్యార్థులను ఉత్తేజపరచుటకు  హిందీ మాస్టారు  రాసినది . దానిని  ఆయనే స్వయముగా ఆగష్టు 15 , జనవరి 26 జెండా వందన్ సభలలో హై స్కూల్  విద్యార్థులు ముందు ఎక్కువగా  పాడేవారు.

“ముందు నడువు” గేయము    యువతను  ఉత్తేజ  పరిచి  ముందుకు  నడిపించే విధముగా రాసారు .కొన్ని  సమాజము  లో  పట్టిన  సమస్యలను  , మూఢ  నమ్మకాలను  వ్యతిరేకించి  వేలెత్తి  చూపేవి .కొన్ని  జాతి  సమైక్యతను   బలపర్చి  దెస  భక్తీ  ని చాటి  చెప్పేవి .

కొన్ని హిందీ పండిట్ గారు ఉద్యోగము  చేసేటపుడు తను కలిసిన  సమకాలీన   గొప్ప  వ్యక్తుల గురించి  సమాజ  సేవకుల  గురుంచి . అందులో భాగమే “పుణ్య మూర్తి” మరియు “పునరంకితం”  గేయాలు.

ఇందులో కొన్ని  గేయములు  హిందీ మాస్టారి  కాలములో  అప్పటి   రాజకీయ  పర్స్తితులను  నిస్ప్శ్పాతముగా  అద్దము   పడుతూ  తన  అభిప్రాయములను  రాసారు .అవి ఏ రాజకీయ  పార్టీ  ని  విమర్శించాలని   కాని  సమర్దించాలని  కాని  వుదేస్యముతో  వ్రాసినవి  కాదు .

నారాయణ పురములో అత్యంత  విషాదకరమైన   రోజు  2014  జూలై  30.  ఆ  రోజు   దాచేపల్లి లోని  tana స్థలమును లీసుకు తీసుకొని ఇతరులు  పెట్టన ప్రైవేటు పాథశాల  పునరుద్ధరణ/రిజిస్ట్రేషన్  కోసము  హైదరాబాద్ నుంచి వెళ్తూ   కారు  ప్రమాదములో  gunde పోటుతో  కను  మూసినారు .

తెలుగులో  అనేక  గేయ  సంకలనములు  వెలువడ్డాయి  కాని  ఇది   ప్రత్యెక  శైలి  లో  అన్ని  కొనములలో  సగటు  మనిషి కి  నిత్య జీవితములో  ఎదురయ్యే  సమస్యలను  తన  జీవిత  కాలములో  అనుభవములను   1959  నుంచి  1999 మధ్య  కాలములో  తను  చూసినవి  అనుభవాలను  తన  హృదయమును  కదిలించినవి   వ్రాసారు.

రమాదేవి
స్వర్ణ కుమార్
విజయ కుమార్
డా. శ్రీ కుమార్

Born to Love

July 10, 2017

Why Writing is so Difficult

July 10, 2017

Leave a Reply